హనుమాన్ ఆలయంలో ఈటల

హనుమాన్ ఆలయంలో ఈటల

KNR: హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలం కొత్తపల్లిలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ శనివారం పర్యటించారు. గ్రామంలోని హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి, స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు పలికారు. నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఎంపీ ఆకాంక్షించారు.