'ఎన్నికల విధులు, బాధ్యతలు పారదర్శకంగా ఉండాలి'

'ఎన్నికల విధులు, బాధ్యతలు పారదర్శకంగా ఉండాలి'

సూర్యాపేట: జిల్లాలో ఎన్నికల విధులు, బాధ్యతలు పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ సూచించారు. సోమవారం సూర్యాపేట సెగ్మెంట్ సంబంధించిన పిఓ,ఏపిఓలకు లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన శిక్షణా తరగతుల్లో కలెక్టర్ పాల్గొన్నారు. సిబ్బంది విధులు, బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఈవీఎం యంత్రాల పనితీరుపై సిబ్బంది సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు.