"కన్నూరులో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం"
HNK: కమలాపూర్ మండలం కన్నూరు గ్రామంలో మంగళవారం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పీఏసీఎస్ డైరెక్టర్ తక్కలపల్లి సత్యనారాయణరావు, మార్కెట్ డైరెక్టర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ రావు మాట్లాడుతూ.. రైతులు ధాన్యాన్ని IKP సెంటర్లో విక్రయించి మద్దతు ధర పొందాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.