కంటైనర్ లారీ దగ్ధం.. డ్రైవర్, క్లీనర్ సురక్షితం
ఆదిలాబాద్ జిల్లాలో శనివారం రాత్రి రన్నింగ్‌లో ఉన్న కంటైనర్ వాహనంలో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం సంభవించింది. మహారాష్ట్రలోని నాగపూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీ పిప్పర్వాడ టోల్ ప్లాజా సమీపంలోకి రాగానే, క్యాబిన్‌లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్, క్లీనర్ కిందకు దూకడంతో ప్రాణనష్టం జరగలేదు.మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడటంతో లారీ పూర్తిగా దగ్ధమైంది.