గుంతల మయంగా రోడ్డు.. అధికారులు స్పందించండి

గుంతల మయంగా రోడ్డు.. అధికారులు స్పందించండి

RR: షాద్ నగర్ పట్టణంలోని పరిగి రోడ్డు హనుమాన్ దేవాలయం ఎదురుగా రోడ్డు గుంతల మయంగా మారింది. రోడ్డు గుంతల మయంగా మారడంతో పాటు వర్షం కురిసినప్పుడు గుంతలలో వర్షపు నీరు నిలిచిపోతుందని, దీంతో రాకపోకలకు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాహనదారులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి మరమ్మత్తులు చేపట్టాలని కోరుతున్నారు.