సరదాగా ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

సరదాగా ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

ATP: గుంతకల్లు శ్రీనివాసనగర్‌కు చెందిన లావణ్య, ఆంజనేయులు దంపతుల కుమారుడు సుదీప్ (10) స్థానిక చర్చి స్కూల్లో 4వ తరగతి చదువుతున్నాడు. గురువారం మధ్యాహ్నం తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఇంటికి సమీపంలోనే ఉన్న ఎస్ఎస్ ట్యాంక్‌లోకి ఈత కొట్టేందుకు వెళ్లిన సుదీప్ నీట మునిగి ఊపిరాడకు మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.