'విద్యార్థులను అభినందించిన ప్రిన్సిపల్'

అన్నమయ్య: కలికిరి జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో ‘Students Arts Crafts Expo’ నిర్వహించామని ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు తెలిపారు. విద్యార్థులు తమ సృజనాత్మకతతో ఆర్ట్స్, క్రాఫ్ట్స్ ప్రదర్శించారు. ఇందులో భాగంగా ప్రదర్శనలను పరిశీలించిన ప్రిన్సిపల్, వాటిని డిజిటల్ మ్యాగజైన్‌లో పొందుపరచాలని సూచించారు. అనంతరం పాల్గొన్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.