అనుమతి లేకుండా ర్యాలీలు, నిరసనలు నిషేధం

అనుమతి లేకుండా ర్యాలీలు, నిరసనలు నిషేధం

SKLM: పలాస-కాశీబుగ్గ పట్టణంలో ఈనెల 1 నుంచి 30వ తేదీ వరకు సెక్షన్ 30 పోలీసు యాక్ట్ అమల్లో ఉంటుందని సీఐ రామకృష్ణ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఎవరైనా ర్యాలీలు, నిరసనలు, ధర్నాలు నిర్వహించాలనుకుంటే ముందుగా పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు. అనుమతి లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.