'భూ సేకరణకు రైతులు సహకరించాలి'

MBNR: మహబూబ్‌నగర్ నుంచి డోన్ వరకు నిర్మించనున్న రైల్వే లైన్ నిర్మాణం కోసం భూసేకరణకు రైతులు సహకరించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ నరసింహారెడ్డి కోరారు. బుధవారం రైల్వే అధికారులతో కలిసి అలీపూర్, ధర్మాపూర్, రామచంద్రపురం, మాచనపల్లి, జనపపల్లి తదితర గ్రామాలలో ఆయన పర్యటించారు. రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.