'పాత బిల్లులను వెంటనే విడుదల చేయాలి'
ములుగులోని విశ్రాంత ఉధ్యోగుల భవనంలో తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ద్వితీయ మహాసభలను నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్‌లో ఉన్న పాత బిల్లులను వెంటనే విడుదల చేయాలని, మధ్యాహ్న భోజన కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలన్నారు.