మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి జైలు

మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి జైలు

VZM: మద్యం సేవించి వాహనం నడిపిన బొండపల్లి మండలం కెరటం గ్రామానికి చెందిన తలే నారాయణకు గజపతినగరం కోర్టు 14 రోజుల జైలు శిక్ష విధించింది. ఆటోలో పరిమితికి మించి 25 మంది ప్రయాణికులను ఎక్కించుకుని, మద్యం మత్తులో వాహనం నడుపుతుండగా బొండపల్లి పోలీసులు అతడిని పట్టుకున్నారు. కేసును విచారించిన న్యాయమూర్తి ఏ. విజయ రాజ్ కుమార్ సోమవారం సాయంత్రం తీర్పునిచ్చారు.