హైదరాబాద్ విమాన ప్రయాణికులకు అలర్ట్
HYD: ఇరాన్ గగనతలాన్ని మూసివేస్తున్న సందర్భంగా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఎయిర్‌పోర్ట్ అధికారులు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ సందర్భంగా భారతీయ విమానయాన సంస్థలు ప్రయాణికులకు పలు సూచనలు చేశాయి. ఈ మేరకు ప్రయాణికులు తమ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరాయి.