ఉద్రిక్తత.. మంత్రి క్యాంప్ కార్యాలయం ముట్టడి
MLG: ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం 18 వేల ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు జిల్లా కేంద్రంలో నిరసన చేపట్టారు. ఈ క్రమంలో వారు MLA క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. 2నెలల పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని, ప్రతి ఆశ వర్కర్‌కు రూ. 50 లక్షల బీమా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.