రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
ప్రకాశం: కనిగిరిలో శనివారం రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో ఈద్గా వద్దకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం పరస్పరం ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు.