'బ్యాంకు భీమాతోనే కుటుంబానికి ధీమా'
ADB: బ్యాంకులోని ఖాతాదారులు ప్రతి ఒక్కరూ బీమా చేసుకుంటే విధి వక్రీకరించిన వారి కుటుంబం ధీమాగా ఉంటుందని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ RM గిర్మోజి నాయక్, బ్రాంచ్ మేనేజర్ మాధురి తెలిపారు. ఈ మేరకు ఇవాళ వారు బ్యాంకులో SBI జనరల్ బీమా ఇన్సూరెన్స్ కట్టిన ఇప్ప భరత్ కుమార్ ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా రూ. 20 లక్షల ప్రమాద బీమాను నామిని అయిన అతని తల్లికి అందజేశారు.