జీజీహెచ్‌లో 8 స్క్రబ్ టైఫస్ కేసులు

జీజీహెచ్‌లో 8 స్క్రబ్ టైఫస్ కేసులు

GNTR: రాష్ట్ర వ్యాప్తంగా 'స్క్రబ్ టైఫస్' వ్యాధి ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే. గుంటూరు జిల్లాలో కూడా ఇప్పటి వరకు 34 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. అందులో కొంతమంది కొలుకోగా.. ప్రస్తుతం జీజీహెచ్‌లో 8 మంది చికిత్స పొందుతున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. వారిలో ఇద్దరు ICUలో ఉన్నట్లు చెప్పారు. అనుమానిత లక్షణాలు ఉంటే నిర్థారణ పరీక్షలు చేసుకోవాలన్నారు.