డిజిటల్ సర్వేకు సహకరించాలి: ఎమ్మెల్యే
W.G: డిజిటల్ సర్వేకు ప్రజలంతా సహకరించాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. సోమవారం తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఆయన హాజరయ్యారు. ప్రజలు తమ ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్ నకళ్లను మున్సిపల్ అధికారులకు అందజేసి, సర్వేలో భాగస్వాములు కావాలన్నారు. సుమారు 19,263 ప్రైవేట్ ఆస్తులు ఉన్నాయన్నారు.