'సైన్యానికి 7.5 లక్షల ట్రక్కులను అందిస్తాం'

'సైన్యానికి 7.5 లక్షల ట్రక్కులను అందిస్తాం'

ఆపరేషన్ సింధూర్ వేళ మధ్యప్రదేశ్‌కు చెందిన ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ (AIMTC) ముందుకొచ్చింది. సుమారు 7.5 లక్షల ట్రక్కులను సైన్యానికి అందిస్తామని తెలిపింది. ఈ మేరకు ఇండోర్‌లో AIMTC రాష్ట్ర చీఫ్ ముకాఠి వెల్లడించారు. ట్రక్కులను ఉచితంగా సైన్యానికి అందించేందుకు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఆపరేషన్ సింధూర్‌తో దేశం మొత్తం గర్వపడాలని అన్నారు.