'ఇంటర్ పూర్తి చేసిన వారికి అవకాశం.. దరఖాస్తు చేసుకోండి'
ప్రకాశం: డీఈఈ సెట్-2026 నోటిఫికేషన్ విడుదలైనట్లు మైనంపాడూ డైట్ ప్రిన్సిపల్ సామా సుబ్బారావు తెలిపారు. ఇంటర్ పూర్తి చేసిన ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 15లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇవాళ్టి నుంచి ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పించామన్నారు. పరీక్ష తేదీ, హాల్ టికెట్ల డౌన్‌లోడ్ వివరాలను త్వరలోనే వెల్లడిస్తారని ఆయన పేర్కొన్నారు.