విద్యుత్ షాక్‌తో ఇద్దరు బీహార్ కార్మికుల మృతి
అన్నమయ్య: బుధవారం ఉదయం పెద్దతిప్పసముద్రం మండలంలోని కందుకూరు గ్రామంలో నిర్మాణ పనులు చేస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన గుడ్డు షహని (27), ఇండ్రె సెహాని (42) అనే ఇద్దరు యువకులు సిమెంట్ ఇటుకలు వేస్తున్న సమయంలో విద్యుత్ వైర్ తగిలి షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.