సీజేఐ సూర్యకాంత్‌కు ఘన వీడ్కోలు
TPT: తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని ఆదివారం రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుగు ప్రయాణమైన భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌కు ఘనంగా వీడ్కోలు లభించింది. కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ శ్రీనివాస స్వామి కళ్యాణ చిత్రపటాన్ని జ్ఞాపికగా అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ సుబ్బరాయుడు, న్యాయమూర్తులు, అధికారులు హాజరయ్యారు.