ఇంటి గోడ కూలి యువకుడు మృతి
HNK: ఎల్కతుర్తి మండలం గోపాలపూర్‌లో ఇంట్లో నిద్రిస్తుండగా సాంబరాజు అనే యువకుడు ఇంటిగది గోడ ఒక్కసారిగా కూలి పైన పడడంతో అక్కడిక్కడే మృతి చెందారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. శుక్రవారం తెల్లవారుజామున సంఘటన స్థలానికి చేరిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.