విశ్వంలో అద్భుత సంఘటన
విశ్వంలో తరచూ జరిగే ఆశ్చర్యకర సంఘటనల్లో గెలాక్సీల విలీనం ఒకటి. లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న 2 గెలాక్సీలు ఢీకొని ఐక్యమవుతున్న IC 1623 చిత్రాన్ని నాసాకు చెందిన ‘చంద్రా అబ్జర్వేటరీ’ క్యాప్చర్ చేసింది. ఈ విలీనం వల్ల కొత్త నక్షత్రాలు లేదా బ్లాక్ హోల్స్ ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించిన ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది.