హనుమజ్జయంతి శుభాకాంక్షలు: చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి ఆంజనేయస్వామికి పరమభక్తుడనే విషయం తెలిసిందే. ఇవాళ హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ప్రత్యేక వీడియోను అభిమానులతో పంచుకున్నారు. 'మనకు నిత్యం కనిపించే ప్రత్యక్ష దైవం ఆ సూర్య భగవానుడి కిరణాలు మా ఇలవేల్పు హనుమంతుడిని స్పృశిస్తున్న అద్భుతమైన సన్నివేశాన్ని మీతో పంచుకుంటున్నాను' అని వీడియో షేర్ చేశారు. అంతకుముందు అందరికీ హనుమజ్జయంతి శుభాకాంక్షలు తెలిపారు.