VIDEO: అధికారుల కృషి వెలకట్టలేనిది: CP
WGL: వరంగల్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం రాత్రి ఒక RSI, 10 మంది కానిస్టేబుల్‌లకు పదవీ విరమణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా CP సన్‌ప్రీత్ సింగ్ హాజరై మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో సుదీర్ఘకాలం నిబద్ధతతో సేవలందించిన అధికారుల కృషి వెలకట్టలేనిదని కొనియాడారు. అనంతరం పదవీ విరమణ చేసిన వారిని ఘనంగా సత్కరించారు.