పలు గ్రామాలలో మద్యం అమ్మకాలపై నిషేధం

పలు గ్రామాలలో మద్యం అమ్మకాలపై నిషేధం

WGL: పర్వతగిరి మండలం గోరుగుట్ట, జగ్గుతండాలో సర్పంచ్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో గ్రామ సభలో మద్య నిషేధం చేపట్టాలని కోరగా గ్రామ పెద్దలు,వార్డు సభ్యులు మద్య నిషేధంపై గురువారం ఏకగ్రీవ తీర్మానం చేశారు. నేటి నుంచి బెల్ట్ షాపుల ద్వారా అమ్మరాదని, ఒకవేళ ఎవరైనా అమ్మితే రూ.50 వేల నుండి రూ.1 లక్ష వరకు జరిమానా విధిస్తామని తీర్మానంలో పేర్కొన్నారు.