బ్లాక్ ఫిల్మ్ వాడుతున్నవాహనాలపై పోలీసుల చర్యలు
SRPT: నిబంధలనకు విరుద్ధంగా బ్లాక్ ఫిల్మ్ వాడుతున్న వాహనాలపై సూర్యాపేట ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించారు. వాహనాల కార్లకు అమర్చిన బ్లాక్ ఫిలింను తొలగించారు. ఇవాళ సీఐ వెంకటయ్య ఆధ్వర్యంలో పట్టణంలోని పలు చోట్ల తనిఖీలు నిర్వహించారు. గతంలో ఎక్కడైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారా... వాటికి సంబంధించి చలాన్లు ఏమైనా పెండింగ్‌లో ఉన్నాయా అని పరిశీలించారు.