జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు

NGKL: గడచిన 24 గంటలలో జిల్లా వ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ అధికారులు ఇవాళ ప్రకటించారు. జిల్లాలో అత్యధికంగా ఉప్పునుంతల మండలంలో 17.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. పెద్దకొత్తపల్లిలో 15.2 మి.మీ, బిజినేపల్లిలో 12.8 మి.మీ, ఊరుకొండలో 12.6 మి.మీ, కల్వకుర్తిలో 10.4 మి.మీ, లింగాలలో 8.6 మి.మీ, అచ్చంపేటలో 8.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు.