VIDEO: యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు

VZM: బుధవారం ఉదయం నుండి ఎస్.కోట, జామి మండలాల్లో ఏకధాటిగా ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. దీంతో జామి పరిసర ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. తెగిపడిన కరెంటు వైర్లను సరి చేస్తున్నారు. ఎక్కడైనా విద్యుత్ సమస్యలు ఉంటే 1912 నెంబర్‌కు తెలపాలన్నారు.