దండేపల్లిలో భారీగా నామినేషన్లు దాఖలు: MPDO
MNCL: దండేపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో సర్పంచ్ స్థానాలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మండలంలో మొత్తం 31 గ్రామపంచాయతీలు ఉండగా, సర్పంచ్ స్థానాలకు 171 నామినేషన్లు దాఖలు అయ్యాయని స్థానిక ఎంపీడీవో ప్రసాద్ వెల్లడించారు. అలాగే అన్ని మండలాల్లో వార్డు స్థానాలకు 576 నామినేషన్లు దాఖలు అయినట్లు ఆయన వెల్లడించారు.