'ఇందిరమ్మ ఇళ్ల సమస్యలను పరిష్కరించాలి'

SRCL: ఇందిరమ్మ ఇళ్ల సమస్యలను పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మూసం రమేష్ అన్నారు. సిరిసిల్లలో మంత్రి వివేక్ వెంకటస్వామికి బుధవారం వినతిపత్రం అందించారు. జిల్లాలో DCL కార్యాలయం, ESI ఆసుపత్రి ఏర్పాటు చేయాలన్నారు. మొన్నటివరకు రూ 1500 ఉన్న ట్రాక్టర్ ఇసుక ఇప్పుడు రూ 7 వేలకు అమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.