VIDEO: విద్యుత్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష
కృష్ణా: గుడివాడలో విద్యుత్ సమస్యలపై ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గురువారం విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షించారు. గ్రామాల వారీగా జరుగుతున్న పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ వ్యవస్థను పటిష్టం చేయడానికి కూటమి ప్రభుత్వంలో రూ.13.50 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.