ఉగ్రదాడులపై నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ

KDP: సిద్ధవటం మండలంలోని మాధవరం-1 గ్రామంలో శుక్రవారం ఉగ్రదాడులపై కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. రాజంపేట జనసేన పార్టీ పార్లమెంటు సమన్వయకర్త అతికారికృష్ణ ఆధ్వర్యంలో కూటమి నాయకులు స్వచ్ఛందంగా నిరసనకు తరలివచ్చారు. కృష్ణ మాట్లాడుతూ.. కశ్మీరులోని పర్యాటక కేంద్రమైన పహాల్గంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేయడం హేమమైన చర్య అన్నారు.