వైసీపీకి మరో షాక్

కృష్ణా: వైసీపీ నుంచి ఇప్పటికే పలువురు ముఖ్యనేతలు పార్టీని వీడగా తాజాగా కైకలూరుకు చెందిన ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవితో పాటు ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామా లేఖను శాసన మండలి ఛైర్మన్ మోసేనురాజుకు పంపించారు. గతంలో టీడీపీలో ఉన్న వెంకటరమణ.. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు వైసీపీలో చేరారు.