ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తాం: ఎమ్మెల్యే

NLG: నకిరేకల్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో నూతనంగా నిర్మించిన కంప్యూటర్ గదిని ఎమ్మెల్యే వేముల వీరేశం గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్య బలోపేతానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతున్నదన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.