'రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దు'

SDPT: సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీల కృషి ఫలితంగా సిద్దిపేట జిల్లాకు 2వేల టన్నుల యూరియాను కేంద్రం కేటాయించిందని, ఇందులో భాగంగానే గజ్వేల్ రేక్ పాయింట్‌కు1000 టన్నుల యూరియా చేరిందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి పేర్కొన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు.