'రైతులను ఆదుకోవాలని డిమాండ్'

'రైతులను ఆదుకోవాలని డిమాండ్'

KRNL: వరి పంట సాగు చేసిన రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని బండి ఆత్మకూరు మండల సీపీఎం నాయకులు డేవిడ్ రాజా డిమాండ్ చేశారు. బండి ఆత్మకూరు మండలం రామాపురం, లింగాపురం గ్రామాల్లో మంగళవారం పర్యటించి రైతులతో మాట్లాడారు. రైతులకు పెట్టిన పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదన్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.