ఈనెల 12న హానికర కర్మాగారాల కమిటీ సభ్యుల సమావేశం

MDK: ఈనెల 12న మెదక్ కలెక్టరేట్లో కలెక్టర్ రాహుల్ అధ్యక్షతన జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని హానికర కర్మాగారాల కమిటీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు కర్మగారాల ఉపప్రధాన అధికారి లక్ష్మీ కుమారి తెలిపారు. ఈ సమావేశానికి కమిటీ సభ్యులు, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ ఫ్యాక్టరీ ఇన్‌స్పెక్టర్, మెదక్ జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ తదితరులు పాల్గొంటారని ఆమె పేర్కొన్నారు.