రక్తదానం ఒక సామాజిక బాధ్యత: మున్సిపల్ ఛైర్మన్

రక్తదానం ఒక సామాజిక బాధ్యత: మున్సిపల్ ఛైర్మన్

KDP: రక్తదానం ఒక సామాజిక బాధ్యత అని మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ వరప్రసాద్ పేర్కొన్నారు. పులివెందుల పట్టణంలోని పలు పాఠశాలలలో గురువారం ముందస్తు 79వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. అనంతరం పలువురు స్వచ్ఛందంగా విచ్చేసి రక్తదానం చేశారు. కాగా, ఇందులో పలువురు పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.