VIDEO: శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపీ, ఎమ్మెల్యే
NRPT: ధన్వాడ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని శనివారం ఎంపీ డికే అరుణ, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శివాజీ మహారాజ్ హిందూ ధర్మ పరిరక్షణకు చిత్తశుద్ధితో పని చేశారని అన్నారు. ప్రతి గ్రామంలో శివాజీ మహారాజ్ విగ్రహాలు ఏర్పాటు చేయాలన్నారు.