కోస్ట్ గార్డ్ సాహసం
VSP: పెంటకోట సముద్ర తీరంలో మత్స్యకారుల వలల్లో చిక్కుకున్న అరుదైన ఆలివ్ రిడ్లే తాబేలును ఇండియన్ కోస్ట్ గార్డు సిబ్బంది చాకచక్యంగా రక్షించి సముద్రంలోకి విడిచిపెట్టారు. ఈ అరుదైన తాబేలును సముద్ర పహెరెదార్ కోస్ట్ గార్డ్ నౌక సిబ్బంది గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది, వలలను తొలగించి తాబేలును సురక్షితంగా సముద్రంలోకి విడిచిపెట్టారు.