జిల్లాలో 39 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం
VKB: జిల్లాలో తాండూర్ డివిజన్‌లో నిర్వహించిన నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక 39 గ్రామాల్లో సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. వికారాబాద్ జిల్లాలోని తాండూర్ డివిజన్‌లో 262 జీపీలకు 39 గ్రామాల సర్పంచ్‌లు ఏకగ్రీవమయ్యాయి. 223 గ్రామాల్లో ఎన్నికలు జరగనున్న 2,198 వార్డులకు 652 వార్డులు ఏకగ్రీవం అయినట్లు వెల్లడించారు.