ఇంటర్ విద్యార్థి సూసైడ్

WGL: జిల్లాలో ఇంటర్ విద్యార్థి అంగోతు నవీన్(16) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పైడిపల్లి గ్రామానికి చెందిన నవీన్ గీసుగొండ సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్లో పని చేస్తున్నాడు. అయితే, అతని తండ్రి నర్సింహ పని చేయకుండా కాలేజీకి వెళ్లి చదువుకోవాలని సూచించాడు. ఈ విషయంపై మనస్తాపం చెందిన నవీన్ జనవరి 28న పురుగుమందు తాగాడు. చికిత్స పొందుతున్న అతను ఫిబ్రవరి 19న మృతి చెందాడు.