ఆడపిల్ల పుడుతుందేమోనని భార్యను చంపిన భర్త
హన్మకొండ జిల్లా పున్నేలు గ్రామంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఆడపిల్ల పుడుతుందనే అనుమానంతో అజారుద్దీన్ భార్య ఫర్హాత్, కూతుళ్లు ఉమేరా, అయేషాలను స్విమ్మింగ్ పూల్లో తోసి హత్య చేశాడు. గతంలో కూడా గర్భస్రావాలు చేయించిన అతను, ఈ హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించగా, పోలీసులు విచారణలో నిజం బయటపడడంతో కేసు నమోదు చేసుకుని రిమాండ్కు తరలించారు.