జాతీయ రహదారిపై లారీ ఢీకొని వృద్దునికి గాయాలు
VZM: డెంకాడ NH పై బుధవారం లారీ ఢీకొన్న ఘటనలో ఓ వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం మోదవలసకు చెందిన గొల్లమాని ఈశ్వరరావు (60) రోడ్డు దాటుతుండగా VZM - VSKP వెళ్తున్న లారీ ఆయన్ని బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన ఆయన్ని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం తగరపువలసలోని NRI ఆసుపత్రికి తరలించారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.