ప్రధాన రహదారి పక్కన ప్రమాదకరంగా గుంత

NLG: మర్రిగూడ మండల కేంద్రంలోని చౌరస్తా సమీపంలోని పెట్రోల్ బంకు ఎదురుగా ఉన్న ప్రధాన రహదారి ప్రక్కన ప్రమాదకరంగా పెద్ద గుంత ఏర్పడింది. దీంతో ప్రయాణికులకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి చర్యలు చేపట్టి, గుంతను పూడ్చి వేయాలని లేదా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.