పాడుబడిన బావిలో యువకుడి మృతదేహం
GNTR: మంగళగిరి - తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని పెనుమాక పంటపొలాల్లో ఉన్న పాడుబడిన బావిలో ఓ యువకుడి మృతదేహం శనివారం ఉదయం గుర్తించారు. గ్రామస్తులు గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మంగళగిరి కొత్తపేటకు చెందిన పిన్నిక ఆనంద్ (23)గా బంధువులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.