ప్రతి సమస్యను పరిష్కరిస్తా: ఎమ్మెల్యే కన్నా
PLD: సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీ నారాయణ శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు తమ ప్రాంతాల సమస్యలను ఎమ్మెల్యేకి వినతిపత్రాల రూపంలో అందజేశారు. ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించిన కన్నా వాటిని త్వరితగతిన పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.