అమెరికా, ఇజ్రాయెల్ నౌకలకే హర్మూజ్ బంద్: ఇరాన్

అమెరికా, ఇజ్రాయెల్ నౌకలకే హర్మూజ్ బంద్: ఇరాన్

ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం అమెరికా, ఇజ్రాయెల్ నౌకలకే హర్మూజ్ జలసంధిని మూసివేసినట్లు తెలిపారు. ఇతర దేశాల నౌకలు స్వేచ్ఛగా ప్రయాణించవచ్చని వెల్లడించారు. అయితే, భద్రతా సమస్యల కారణంగా అనేక దేశాలు ముందుకు రావడం లేదన్నారు. దీనికి ఇరాన్‌తో ఎటువంటి సంబంధం లేదని అరాగ్చీ స్పష్టం చేశారు.