విద్యుత్ షాక్‌తో తండ్రీకొడుకుల మృతి
SRPT: చివ్వెంల మండల కేంద్రంలో విషాదం నెలకొంది. ఇల్లు నిర్మాణంలో పిల్లర్లకు నీళ్లు కొడుతుండగా విద్యుత్ షాక్‌కు గురై మాదాసు బుచ్చయ్య (48), కుమారుడు లోకేష్ (22) మృతి చెందారు. ఈరోజు మోటార్ ద్వారా నీళ్లు పడుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ సరఫరా కావడంతో ఇద్దరూ అక్కడికక్కడే కుప్పకూలారు. ఒకే కుటుంబంలో ఇద్దరు మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.